చలి కాలం వచ్చింది అంటే పిల్లల్లో రొంప, దగ్గు, జలుబుతో పాటు టాన్సిలైటిస్ కూడా సోకే ప్రమాదం ఉంది. ఆహరం తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, గొంతు వాపు మొదలైనవి టాన్సిలైటిస్ ముఖ్య లక్షణాలు. టాన్సిలైటిస్ పిల్లల్లోనే కాకుండా పెద్ద వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. తరచూ వైద్యులు Tonsillectomy చెయ్యాలి అని అంటూ ఉంటారు, అసలు Tonsillectomy అంటే ఏంటి, Tonsillectomy procedure ఎలా చేస్తారు ? వంటి అన్నీ సందేహాలు నివృత్తి చేసుకోడానికి పూర్తి ఆర్టికల్ని చదవండి.
పిల్లల్లో అయిన పెద్దల్లో అయిన టాన్సిలైటిస్ ని మందులతో నివారించవచ్చు కానీ, కొన్ని సందర్భాలలో అది తిరిగి పునరావృతం(recurring tonsils) అవుతుంది లేదా శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది వంటి పరిస్థితులకు దారితీస్తుంది లేదా మీ ENT నిపుణులు టాన్సిలైటిస్ మందులతో తగ్గదు అని నిర్ధారణ కి వచ్చిన తర్వాత శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తారు దీనినే Tonsillectomy అని అంటారు. అధునాతన పరికరాల సహాయంతో రక్తస్రావం లేని నొప్పి లేని శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
టాన్సిలెక్టమి శస్త్ర చికిత్స విధానాలు(Tonsillectomy procedure), తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్య సమాచారం గురించి పూర్తిగా తెలుసుకోండి.
టాన్సిలైటిస్ వ్యాది నిర్ధారణ ఎలా చేస్తారు?
Tonsillectomy procedure:
అసలు మీ బాబు/ పాప టాన్సిలైటిస్ తో బాధ పడుతున్నారా లేదా అని మీ ENT వైద్య నిపుణులు వివిధ రకాల పరీక్షల ద్వారా తెలుసుకుంటారు అవి:
- గొంతులోకి లైట్ వేసి చూసినపుడు టాన్సిల్స్ వాచి నట్టు కనిపిస్తే టాన్సిలైటిస్ సోకింది అని ప్రాధమిక నిర్ధారణకి వస్తారు.
- Swab test: ఇందులో ఒక స్వాబ్ లేదా ఇయర్బడ్(earbud) ని ENT వైదులు తీసుకుని గొంతులో పెట్టి పరీక్షించి టాన్సిలైటిస్ ఉందా లేదా అని నిర్ధారిస్తారు ఇది పిల్లలో కొంచం అసౌకర్యానికి కారణమవ్వచ్చు. కొన్ని సందర్భాలలో టాన్సిల్స్ గ్రంధుల నుంచి చిన్న ముక్కని కోసి కల్చర్ టెస్ట్ (culture test) కి పంపించి వ్యాదికి గల కారణాలు తెలుసుకుంటారు.
- టాన్సిలైటిస్ బాక్టీరియా వల్ల లేదా వైరస్ వల్ల సంభవించిందా అని తెలుసుకోవడానికి రక్తపరీక్షలు (complete blood count) చేసి తదనుగుణంగా వైద్యం చేస్తారు.
టాన్సిలెక్టమికి సరైన చికిత్సా విధానం:
శస్త్రచికిత్స ద్వారా టాన్సిల్స్ ని తొలగించడాన్ని టాన్సిలెక్టమి అని అంటారు. టాన్సిలెక్టమి ని వివిధ శస్త్రచికిత్సల పద్దతులలో చేస్తారు. Tonsillectomy procedureని మూడు విధాలుగా చేస్తారు అవి:
ఈ విధానం లో టాన్సిల్స్ ని స్కాలపెల్ (scalpel) ఒక రకమైన వైద్యుని చాకు తో టాన్సిల్స్ గ్రంధులని కోసి గొంతు నుండి తీసివేస్తారు. ఈ విధానం లో అధిక రక్తస్రావం మరియు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. చిన్న పిల్లలు తిరిగి కొలుకోడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇది పాత పద్దతి మరియు అధునాతన పద్దతులు వచ్చాక ఈ పద్దతిలో శస్త్రచికిత్సలు తక్కువగా జరుగుతున్నాయి.
ఇది అధునాతన పద్దతి, ఇందులో కొబ్లెటర్ సహాయం తో టాన్సిల్స్ గ్రంధులని గొంతు నుంచి తొలగిస్తారు. ఈ విధానం లో రక్తస్రావం, నొప్పి ఉండవు మరియు తొందరగా నయం అవుతుంది. ఈ విధానం పిల్లలకి చాలా సురక్షితమైనది మరియు వాళ్ళు త్వరగా కోలుకుంటారు.
ఈ విధానం లో రేడియొ ఫ్రీక్వెన్సీ(radiofrequency) లేదా లేజర్ (laser) ఎనర్జీ ద్వారా అధిక మొత్తంలో వేడి విడుదల అవుతుంది. ఆ వెడి వల్ల టాన్సిల్స్ గొంతుకకి ఉన్న కణాలు చనిపోతాయి ఆ విధంగా టాన్సిల్స్ ని గొంతులోంచి తొలగిస్తారు. ఈ విధానం లో కూడా రక్తస్రావం జరగదు అంతేకాకుండా గాయం కూడా తొందరగా నయం అవుతుంది.
టాన్సిలెక్టమికి తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలా?
మీ బాబు/ పాప టాన్సిలైటిస్ తో బాధ పడుతుంటే తప్పక ENT నిపుణునికి చూపించండి. టాన్సిలైటిస్ మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స చేయించాలి లేకపోతే పిల్లల్లో కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి అవి :
- మధ్య చెవి లో ఇన్ఫెక్షన్స్ ఏర్పడతాయి అవి అక్కడితో ఆగకుండా మెదడుకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
- టాన్సిల్స్ గ్రంధులలో చీము (pus) చేరడం దీనినే పెరిటాన్సిలార్ ఆబ్సెస్ (peritonsillar abscess) అంటారు.
- స్ట్రెప్టోకోకల్ మరియు స్ట్రెప్ బ్యాక్టీరియా గొంతులో వివిధ సమస్యలకు దారితీస్తాయి.
- పిల్లలకు ఊపిరి అందటం లో ఇబ్బంది ఎదురవడం తద్వారా స్లీప్ అప్నే(obstructive sleep apnea) లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి, ఇవి అరుదుగా సంభవించినప్పటికి వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
- టాన్సిల్ లో బ్యాక్టీరియా చేరి రాళ్ళు ఏర్పడవచ్చు తద్వారా నొప్పి మరియు వాపు కనిపిస్తుంది. బ్యాక్టీరియా నుండి విడుదలయిన అవశేష వ్యర్థాలు రాళ్ళుగా మారతాయి.
- పిల్లలు రుమాటిక్ జ్వరం బారిన పడె అవకాశం ఉంది.
శస్త్రచికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?
శస్త్రచికిత్స జరిగిన రోజు, త్రాగడం మరియు మింగడం/తినడం కష్టంగా ఉంటుంది , గొంతు నొప్పి కూడా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో మీ బాబు/ పాపని వీలైనంత హైడ్రేటెడ్‌గా(hydrated) ఉంచాలి అపుడు వారు త్వరగా కోలుకుంటారు.
శస్త్రచికిత్స అనంతరం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేయకూడని పనులు గురించి తెలుసుకోండి.
- నొప్పి నివారణ మందులు సిఫార్సు చేయబడితే, వాటిని నిర్ణీత వ్యవధిలో తీసుకోవాలని గుర్తుంచుకోండి .
- రోగి ప్రతి గంటకు నీరు లేదా పండ్ల రసాలు వంటి ద్రవాలను తీసుకోవడం మంచిది.
- ఆహార పరిమితి లేదు మరియు రోగి ఐస్ క్రీంతో సహా అన్ని రకాల ఆహారాలను తినవచ్చు.
- శస్త్రచికిత్స తర్వాత ఒక వారం పాటు భారీ శారీరక శ్రమను నివారించడం మంచిది.
పెద్దలు అయితే శస్త్రచికిత్స తర్వాత ఒక వారం వరకు ఇంటి నుండి పని చేయడం మంచిది. - శారీరకంగా పనిని పునఃప్రారంభించే ముందు డాక్టర్ గారి సూచన తప్పనిసరిగా తీసుకోండి.
- శస్త్రచికిత్స జరిగిన రోజు దుమ్ము లేదా ధూళి ప్రదేశాలలో తిరగకూడదు.
- శస్త్రచికిత్స జరిగిన రోజు అతి చల్లని లేదా అతి వేడి పదార్దాలు తీసుకోకూడదు, గోరువెచ్చని, మెత్తని ఆహార పదార్ధాలు మాత్రమే తీసుకోవాలి.
FAQs
Tonsillectomy procedure కొబ్లెషన్ పద్దతిలో 20-40 నిముషాలలో పూర్తి అవుతుంది. శస్త్రచికిత్స పూర్తిఅయిన తర్వాత బాబు/ పాప పరిస్థితి నిలకడగా ఉంటే వైద్యులు ఒక గంట లోనే ఇంటికి పంపించెస్తారు.
శస్త్రచికిత్స తర్వాత మీ బాబు/ పాప్ టాన్సిలైటిస్ బారిన పడరు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోయిన, మందులు వాడకపోయిన అరుదుగా టాన్సిలైటిస్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్పు డు మీ డాక్టర్ గారి సూచన మేరకు మందులు వాడాలి. .
శస్త్రచికిత్స తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాబు/ పాప తొందరగా కోలుకుంటారు మరియు భవిష్యత్తు లో మళ్ళీ టాన్సిలైటిస్ బారిన పడకుండా ఉంటారు.
శస్త్రచికిత్స తర్వాత పిల్లల్లో సాధారణంగా ఇబ్బందులు ఎదురవవు, కానీ తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి (వైద్య పరిభాషలో tonsillectomy complications అని అంటారు). సమయానికి మందులు వేసుకోవడం, ఆరోగ్యమైన, బలమైన ఆహారం తినడం తప్పనిసరి. కొద్ది మందిలో వాపు, ఇన్ఫెక్షన్ రావడం లేదా రక్తస్రావం కావడం జరుగుతుంది, డాక్టర్ గారి సూచన మేరకు మందులు, సలహాలు పాటించండి.
కొబ్లెషన్ పద్దతి లో శస్త్ర చికిత్స జరిగితే రక్తస్రావం మరియు నొప్పి ఉండదు.
టాన్సిలెక్టొమీ వల్ల మీ పిల్లల్లో చాలా మార్పులు కనిపిస్తాయి అవి :
- ప్రశాంతమైన నిద్ర
- త్వరగా ఇన్ఫెక్ష బారిన పడకపోవడం
- మెరుగైన జీవన విధానం
- ఆహారాన్ని సులువుగా తీసుకోవడం
- గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గడం
WHY CHOOSE EAR SURGEON?
Dr. Shree Cuddapah Rao is acclaimed as one of the best pediatric ENT specialists in Hyderabad. With 10+ years of deep domain experience in the field of ENT, she is the director at Dr. Rao’s ENT Super Specialty Hospital. She underwent specialized training in Rhinoplasty / Facial Plastic surgery at Singapore General Hospital, Singapore. She also underwent advanced training in cochlear implant surgery under Padmashri Dr. Milind V Kirtane and had a Fellowship in a cochlear implant. Having performed over 200 successful cochlear implants for patients worldwide, Dr. Shree Cuddapah Rao is also the recipient of several prestigious accolades in the domain of ENT.
Are you looking for
then you have landed at right place!